భారతదేశం, జనవరి 26 -- బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరూరి రమేశ్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2023 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని వీడారు.

పార్లమెంట్ ఎన్నికల ముందుకు బీజేపీ గూటికి చేరారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంత కాలం పాటు పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు. అయితే చాలా రోజులుగా ఆయన పార్టీ మారుతారనే చర్చ జోరుగా వినిపించాయి.ఈ వార్తలను ఆయన కొట్టిపారిస్తూ వచ్చినప్పటికీ.. తాజాగా మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు సహకరించి...