భారతదేశం, ఏప్రిల్ 18 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) 2025 నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది. నోటీసు కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. సీటెట్ జులై 2025 నోటిఫికేషన్‌ను ctet.nic.in అధికారిక వెబ్‌‌సైట్‌లో విడుదల చేయనున్నారు. సీటెట్ 2025కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అర్హత, రిజిస్ట్రేషన్ దశలు, ఇతర వివరాలు తెలుసుకోవాలి.

సీబీఎస్ఈ ఏటా రెండుసార్లు సీటెట్ పరీక్షను నిర్వహిస్తుంది. మొదటి పరీక్షను జూలై నెలలో, రెండో పరీక్షను డిసెంబరులో నిర్వహిస్తారు. సీటెట్ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు. పేపర్ -2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 6 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణ...