Hyderabad, ఆగస్టు 21 -- శుక్రుడు సంపద, విలాసాలకు కారకుడు. శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 15న ఉదయం 12:06కి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. మరి శుక్రుడు సింహరాశి సంచారం ఏ రాశుల వారికి కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి శుక్రుడి రాశి మార్పు చిన్నపాటి సమస్యలను తీసుకొస్తుంది. ఆర్థిక ఒత్తిడి, ఎక్కువ ఖర్చుతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో గొడవలు పడే అవకాశం ఉంది.

వృషభ రాశి వారికి శుక్రుడి రాశి మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు...