భారతదేశం, జనవరి 6 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందినప్పుడు కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. 12 రోజులు వారిపై ప్రభావం పడినా, కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు.

మరి శని, శుక్రుల సంయోగం ఎప్పుడు చోటు చేసుకోబోతోంది? ఆ అదృష్ట రాశులు ఎవరు? వారి జీవితంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 మార్చిలో శని, శుక్రుల సంయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక లాభాలు ఇస్తుంది.

మార్చి 29, 2025న శని కుంభ రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 3, 2027 వరకు ఇదే రాశిలో...