భారతదేశం, సెప్టెంబర్ 17 -- మెడిక‌ల్ క‌ళాశాల‌ల విష‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అస‌త్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి మండిప‌డ్డారు. మెడికల్ కాలేజీల‌ను ప్రైవేటు ప‌రం చేయ‌డం లేద‌ని ప్రజలు , ప్రభుత్వంతో పాటు ఆర్థికంగా నిల‌దొక్కుకున్న వారి స‌హ‌కారంతో మంచి కాలేజీల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని మంత్రి వివ‌రించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూట‌మి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని చెప్పారు. ప‌ల్నాడు జిల్లా వినుకొండ‌లో మంత్రి గొట్టిపాటి బుధ‌వారం పర్యటించారు. ఓ ఫౌండేష‌న్ స‌హ‌కారంతో నిర్మించిన బ‌స్ స్టాప్ ను ప్రారంభించారు. అనంత‌రం స్త్రీ శ‌క్తి విజ‌యోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.

ర్యాలీ అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భలో మాట్లాడారు మంత్రి. సభ ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన వివిధ ర‌కాల స్టాల్స్ ను ప్రారంభించి, ఔత్సాహిక పారిశ్రామిక‌వే...