భారతదేశం, జనవరి 16 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే మరి కొన్ని రోజుల్లో బుధుడు, శుక్రుడు ఒకే నక్షత్రంలో సంచారం చేస్తారు. దీంతో శుభయోగం ఏర్పడబోతోంది. ఫిబ్రవరి 7న బుధుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

ఆ తర్వాత నాలుగు రోజులకు, అంటే ఫిబ్రవరి 11న శుక్రుడు కూడా శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది శుభయోగం. ఇది కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి లక్ష్మీనారాయణ యోగం బాగా కలిసి రాబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి వారికి ఈ యోగం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో సక్సెస్‌ను అందుకుంటా...