Hyderabad, ఆగస్టు 11 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. కుజుడు ధైర్యం, తెలివితేటలు వంటి వాటికి కారకుడు. త్వరలో కుజుడు తన సొంత రాశి అయినటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.

సెప్టెంబర్ నెలలో కుజుడు రాశి మార్పు చెందడంతో రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. 12 రాశుల వారిపై ఈ రాజయోగం ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతారు.

రుచక రాజయోగం మహాపురుష రాజయోగం. ఇది ఎంతో శుభప్రదం. ఈ రాజయోగం ఏర్పడినప్పుడు కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. కెరీర్‌లో అభివృద్ధి చూడొచ్చు. డబ్బుకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. సోషల్ నెట్వర్కింగ్ కెరీర్‌లో హెల్ప్ అవుతుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. మరి సెప్ట...