భారతదేశం, మే 18 -- రాబోయే నెలల్లో చాలా ద్విచక్ర వాహనాలు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2025 లో విడుదల చేయబోయే 5 మోస్ట్ అవైటెడ్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల గురించి తెలుసుకుందాం..

బీఎమ్‌డబ్ల్యూ ఎఫ్450 జిఎస్ కాన్సెప్ట్‌ను 2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రవేశపెట్టారు. తాజాగా హోసూరులోని టీవీఎస్ ఫ్యాక్టరీ సమీపంలో ఇది కెమెరాకు చిక్కింది. 2025 చివరి త్రైమాసికంలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బీఎమ్‌డబ్ల్యూ బైక్‌లో సింగిల్ యూనిట్ హెడ్ ల్యాంప్స్, బీక్ లాంటి ఫ్రంట్ ఫెండర్స్, అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

టీవీఎస్ 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆర్టీఎక్స్ 300 కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. 2025 సెప్టెంబర్ లో దీన్ని లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిసింది. ఆల్ ఎల్ఈడీ లైటింగ్, అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్, లాంగ్ వి...