భారతదేశం, ఏప్రిల్ 20 -- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) 2024 సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాలను త్వరలో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. యూపీఎస్సీ సీఎస్ఈ 2024 తుది ఫలితాలను యూపీఎస్సీ upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.

యూపీఎస్సీ 2025 జనవరి 7 నుంచి చివరి విడత సెలక్షన్ ఇంటర్వ్యూలను ప్రారంభించింది. ఇంటర్వ్యూ రౌండ్ 2025 ఏప్రిల్ 17న ముగిసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా 1132 ఐఏఎస్, ఐపీఎస్, ఇతర సర్వీసుల పోస్టులకు అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేయనుంది.

యూపీఎస్సీ మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. ఏటా లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్(ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్), రైల్వే గ్రూప్ ఏ(ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్), ఇండియన్ ...