భారతదేశం, జూలై 2 -- ఆదాయపు పన్ను మినహాయింపు తరువాత, ఇప్పుడు సామాన్యుడికి మరో పెద్ద ఉపశమనం లభిస్తుంది. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు శుభవార్త వస్తుంది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో కోత రూపంలో ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను పూర్తిగా రద్దు చేయడం లేదా 5 శాతం స్లాబులో చేర్చేలా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు తర్వాత ఇది పెద్ద ఉపశమనం కానుంది. జీఎస్టీ స్లాబును పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటిలో మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉపయోగించే వస్తువులు ఉంటాయి.

టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెజర్ కుక్కర్లు, వంటింటి పాత్రలు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ, గీజర్లు, స్మాల్ కెపాసిటీ వాషింగ్ ...