Hyderabad, జూలై 24 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు శుభయోగాలు ఏర్పడతాయి. బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది.

సెప్టెంబర్ 2025 లో ఒక అద్భుతమైన రాజయోగం ఏర్పడనుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, వాక్కు వంటి వాటికే కారకుడు. తన సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది.

ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారి వ్యాపారంలో లాభాలు పొందుతారు, సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి, కెరియర్‌లో కూడా కలిసి వస్తుంది. మరి ఏ రాశులకు బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మిధున రాశి వారికి ఈ రాజయోగం శుభ ఫలితాలను ...