Hyderabad, జూన్ 17 -- 2025 జూలై 18న బుధుడు తిరోగమనంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు తెలివితేటలు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివితేటలు, స్నేహం వంటి వాటికి కారకుడు. జ్యోతిష శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని యువరాజు అంటారు. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి.

అలాగే బుధుడు కూడా ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాడు. జూలై నెలలో సింహ రాశిలో బుధుడి తిరోగమనం చెందుతాడు. ఈ సమయంలో బుధుడు కొన్ని రాశులకు మంచి సమయాన్ని ఇస్తాడు. మరి బుధుడి తిరోగమనం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను తెలుసుకుందాం.

మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాబట్టి అవకాశాలను వదులుకోకుండా జీవితంలో పురోభివృద్ధి పథంలో ముందుకు సాగండి. వ్య...