భారతదేశం, జనవరి 28 -- ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎస్.సవిత అన్నారు. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని తెలిపారు. విజయవాడ నగరం గొల్లపూడి బీసీ భవన్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్‌ను మంగళవారం మంత్రి సవిత సందర్శించారు. ఈ సందర్బంగా బీసీ అభ్యర్థులకు వివిధ సబ్జెక్టులకు చెందిన 43 రకాల మెటీరియల్ ను వారికి అందజేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలో ఉండే కీలక స్థానాల్లో బీసీ యువత ఉండాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారన...