Hyderabad, ఆగస్టు 23 -- 2025 అక్టోబర్ 18న దేవ గురువు తన సంచారంలో మార్పు చేస్తాడు. ఆ రోజున, గురువు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష శాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవ గురువు బృహస్పతి అనుగ్రహంతో కొన్ని రాశులకు కలిసి వస్తుంది. బృహస్పతి జ్ఞానానికి, గురువుకు, సంతానానికి, అన్నయ్యకు, విద్యకు, ధార్మిక పనులకు, పవిత్ర ప్రదేశానికి, సంపదకు, దాతృత్వానికి, సద్గుణానికి, ఎదుగుదలకు ప్రతీకగా చెబుతారు.

27 నక్షత్రాలలో పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రాలకు బృహస్పతి అధిపతి. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, గురువు కర్కాటక రాశిలో స్థిరపడి కొన్ని రాశులకు ప్రత్యేక ఆశీస్సులు ఇస్తాడు. కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశంతో ఏయే రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయో తెలుసుకుందాం.

గురువు సంచారం మేష రాశి వారికి మేలు చేస్తుంది. మీ గ...