Telangana,hyderabad, జూలై 6 -- రాష్ట్రంలో కొత్త స్టాంప్ విధానం తీసుకురావాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఆ దిశగా కసరత్తును చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లోనే బిల్లును తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే సంస్కరణలో భాగంగా.. మహిళలకు స్టాంప్ డ్యూటి తగ్గించే ప్రతిపాదనను కూడా సర్కార్ పరిశీలిస్తోంది. పాత అపార్ట్ మెంట్‌ల‌కు స్టాంప్ డ్యూటి వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. సీఎం ఆమోదం తర్వాత.. అధికారికంగా ప్రకటన వెలువుడే అవకాశం ఉంది.

కొత్త స్టాంప్ విధానం కసరత్తుపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం కీలక ప్రకటన చేశారు. భారతీయ స్టాంపు చట్టం 1899ను అనుసరించి తెలంగాణ సవరణ బిల్లు-2025ను తీసుకురావాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ బిల్లును తీసుకువ‌చ్చేలా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్...