Hyderabad, జూలై 1 -- సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని సంచారం వలన కొన్ని రాశుల వారికి మంచి జరిగితే, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యుడు జులై 16న సాయంత్రం 5:17కి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.

కర్కాటక రాశిలో సూర్యుని సంచారం నాలుగు రాశుల వారికి అనేక లాభాలను అందిస్తుంది, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది, ప్రమోషన్లు, ఉద్యోగాలు ఇలా ఈ నాలుగు రాశుల వారు బోలెడు లాభాలను పొందవచ్చు.

మేష రాశి వారికి సూర్యుని రాశి మార్పు కొన్ని ప్రత్యేక ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారికి మంచి జరుగుతుంది, సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో సక్సెస్‌ను అందుకుంటారు, వ్యాపారులకి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ప్రేమ ఫలిస్తుంది, జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే, మేష రాశి ...