భారతదేశం, జూన్ 24 -- ఈపీఎఫ్ఓ చందాదారులు త్వరలో తమ ఈపీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎం లేదా యూపీఐల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ చందాదారులు తమ బ్యాంకు ఖాతాలను ఈపీఎఫ్ తో అనుసంధానం చేసిన తర్వాత ఏటీఎంలు లేదా యూపీఐ వంటి ఇతర మార్గాల ద్వారా తమ ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డబ్బులను నేరుగా తమ ఖాతాల నుంచి ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్ డిపాజిట్లలో కొంత భాగాన్ని మాత్రం నిలిపివేసి, మిగతా మొత్తాన్ని యూపీఐ లేదా ఏటీఎం, డెబిట్ కార్డులు వంటి వివిధ పద్ధతులను ఉపయోగించి వారి బ్యాంకు ఖాతా ద్వారా విత్ డ్రా చేసుకునే వీలు కల్పించే ప్రాజెక్టుపై కార్మిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ విధానాన్ని అమలు చేయడంలో కొన్ని సాఫ్ట్ వేర్ స...