భారతదేశం, ఫిబ్రవరి 5 -- ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై కొన్ని రోజుల కిందట ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తనపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులు చేశారని ఆమె ఆరోపణలు చేశారు. కొన్ని రోజులుగా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టుగా రైల్వే కోడూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

'శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసిన మహిళ ఆరోపించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.' అని చంద్రశేఖర్ అన్నారు.

ఆ మహిళ తన న్యాయవాదితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర మ...