Hyderabad, మే 6 -- అమర్నాథ్ యాత్రను పూర్తి చేయాలని, ఆ గుహలోని శివలింగాన్ని చూడాలని ప్రతి శివ భక్తుడి కోరిక. అమర్నాథ్ ప్రయాణం చేయడం ఎంతో కష్టం. ఆ ప్రయాణం చేసి మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుని వచ్చేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి వెళతారు.

అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని చూస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని జీవితంలో కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు. మొదటిసారి అమర్నాథ్ గుహను ఎవరు చూశారో తెలుసా? ఆ మొదటి భక్తుడు గురించి తెలుసుకోండి.

మత విశ్వాసాలు చెబుతున్న ప్రకారం అమర్నాథ్ గుహను మొదట భృగు మహర్షి సందర్శించాడని అంటారు. కాశ్మీర్ లోయలో వరదల వల్ల మునిగిపోయినప్పుడు కశ్యప మహర్షి నదులు, కాలువలు ద్వారా ఆ నీటిని బయటికి తరలిపోయేలా చేశాడని అంటారు. అదే సమయంలో భృగు మహర్షి హిమాలయాలకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మార్గమధ్యంలో తపస్సు చేసుకోవడానికి ఒక ఏకాంత ప్...