భారతదేశం, ఆగస్టు 18 -- నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్​) ఇటీవల నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్​ పీజీ) 2025 పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in లో తమ స్కోరును చూసుకోవచ్చు.

ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే, అభ్యర్థులు తమ కేటగిరీకి నిర్దేశించిన కటాఫ్ మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులను సాధించాల్సి ఉంటుంది. నీట్ పీజీ 2025 కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటే ప్రకటిస్తారు. అయితే పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లోనే ఎన్​బీఈఎంఎస్​ వివిధ కేటగిరీలకు నిర్దేశించిన కటాఫ్ పర్సంటైల్‌ను పేర్కొంది. ఆ వివరాలు కింద ఉన్నాయి:

జనరల్ / ఈడబ్ల్యూఎస్: 50వ పర్సంటైల్

ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ (ఎస్సీ / ఎస్ట...