Andhrapradesh,puttaparthi, జూలై 10 -- రాష్ట్రంలో కొత్త టీచర్ల రాకపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో మాట్లాడిన ఆయన. గతంలో 12 సార్లు డీఎస్సీలు చేసి 1.66 లక్షల మందిని ఉపాధ్యాయులను నియమించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా చేపట్టలేదన్నారు.

కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 మంది ఉపాధ్యాయులను నియమిస్తున్నామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఆగస్టు నాటికల్లా వీరంతా పాఠశాలలకు వస్తారని ప్రకటించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని గుర్తు చేశారు.

మొదటి దఫా పేరెంట్ టీచర్ మీటింగ్ ను 44 వేల పైచిలుకు పాఠశాలల్లో నిర్వహించామని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను ప్రైవేటు స్కూల్ల...