Hyderabad,telangana, ఏప్రిల్ 20 -- త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఖాళీల వివరాలను వెల్లడించారు.

ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామని తెలిపారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

ఆర్టీసీలో మహిళలకు...