Andhrapradesh, జూన్ 2 -- ఏపీలో మళ్లీ రేషన్ దుకాణాల వ్యవస్థ మళ్లీ ప్రారంభమైంది. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారానే సరుకులను పంపిణీ చేస్తున్నారు. డోర్ డెలివరీ విధానం రద్దు కావటంతో. రేషన్ కార్డుదారులు షాపుల వద్దకు వెళ్లి సరుకులను తీసుకుంటున్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీఠ వేస్తున్నామని. త్వరలోనే మరిన్ని మార్పులు తీసుకువస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.

ఆదివారం పిఠాపురం పట్టణ పరిధిలో చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరకుల పంపిణీని మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 29,761 రేషన్ షాపులకుగానూ. 24,795 షాపుల్లో సరుకుల పంపిణీని ప్రారంభించామని చెప్పారు.

తూకాల్లో వ్యత్యాసం ఉన్నా, సరుకులు లేవని తిప్పి పంపినా డీలర్లపై చర్...