Hyderabad, సెప్టెంబర్ 11 -- ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన నటి త్రిష కృష్ణన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ రాబోతోంది. గతేడాది జులైలో వచ్చిన బృందా వెబ్ సిరీస్ అభిమానులకు బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతున్నట్లు సోనీ లివ్ ఓటీటీ ఓ స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది.

సోనీ లివ్ ఓటీటీలో గతేడాది జులై 31న బృందా వెబ్ సిరీస్ రిలీజైంది. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలో 7.4 రేటింగ్ వచ్చింది. ఇప్పుడీ సిరీస్ కు ఆ ఓటీటీ రెండో సీజన్ అనౌన్స్ చేసింది. తమ ఓటీటీలోకి ఈ ఏడాది ఇంకా రాబోతున్న కొత్త వెబ్ సిరీస్, కొత్త సీజన్ల గురించి అనౌన్స్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

అందులో ఈ బృందా సీజన్ 2 కూడా ఉంది. ఆ వీడియోలో చిన్న భాగం మాత్రమే ఈ సిరీస్ గురించి క్లిప్ ఉంది. రానున్న రోజుల్లో ఈ కొత్త స...