భారతదేశం, ఫిబ్రవరి 16 -- సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరైన త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన సినిమాల వల్ల కాదు.. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా ఆమె సీరియస్ అయింది. కొన్ని రోజుల కిందట తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్, త్రిషను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన త్రిష.. సోమవారం (ఫిబ్రవరి 16) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది.

త్రిష తరఫు న్యాయవాది విడుదల చేసిన ఈ ప్రకటనలో బీజేపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "ఇండియన్ సినీ నటి, నా క్లయింట్ త్రిష కృష్ణన్ ఆదేశాల మేరకు నేను ఈ విషయాన్ని రికార్డు చేస్తున్నాను. మీడియాలో నా క్లయింట్ గురించి ప్రచారంలో ఉన్న అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల మేము తీవ్ర అభ్యంతరం వ్...