Hyderabad, జూన్ 23 -- తమిళ నటీనటులు త్రిష కృష్ణన్, విజయ్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. ప్రైవసీ మెయింటేన్ చేసే విజయ్ తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఎప్పుడూ మాట్లాడనప్పటికీ.. త్రిషతో కలిసిన ప్రతిసారి ఈ పుకార్లు మళ్లీ మళ్లీ తెరపైకి వస్తాయి. ఇప్పుడు ఆమె అతనికి చేసిన పుట్టినరోజు పోస్ట్ ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోస్తోంది.

త్రిష తన సోషల్ మీడియాలో విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అందమైన ఫోటోను పోస్ట్ చేసింది. తన పెంపుడు కుక్క ఇజ్జీతో విజయ్ ఆడుకుంటుండగా, త్రిష అతని నుండి కళ్లు తిప్పుకోలేనట్లుగా చూస్తుండటం ఆ ఫొటోలో కనిపిస్తుంది.

"హ్యాపీ బర్త్‌డే బెస్ట్‌స్ట్" అనే క్యాప్షన్ తోపాటు ఓ హగ్ ఇస్తున్న ఎమోజీని కూడా పెట్టడం విశేషం. దీంతో ఆమె కామెంట్ సెక్షన్ రెడ్ హార్ట్ ఎమోజీలతో నిండిపోయింది. అభిమానులు వారిని 'రె...