భారతదేశం, మే 9 -- భారత్‌లో 24 నగరాలను టార్గెట్‌ చేసిన పాక్‌.. గురువారం రాత్రి 500 డ్రోన్లతో దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాల నగరాలే టార్గెట్‌గా దాడులు చేస్తోంది. పాక్‌ డ్రోన్లను గగనతలంలోనే భారత్‌ పేల్చేసింది. అటు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను మరింత పెంచాలని కేంద్రం సూచించింది. అన్ని రాష్ట్రాలకు సీఎస్‌కు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

'త్రివిధ దళాలకు మా సెల్యూట్. ఒక్క పౌరుడు గాయపడకుండా దాడులు చేశారు. ఏ ప్రభుత్వం ఉన్నా బుద్ధిచెప్పడం తప్పనిసరి. మన రాఫెల్‌ యుద్ధ విమానాలను ఎక్కడా కూల్చలేదు. పాకిస్తాన్‌ అబద్ధాలు చెబుతోంది. యుద్ధం మొదలైతే పాకిస్తాన్‌ పతనమే. పాక్‌ విచ్ఛిన్నమడం ఖాయం. యుద్ధంలో మూడో దేశం ఎప్పుడూ ముందుకు రాదు' అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

'పీవోకేను ఇండియా స్...