భారతదేశం, డిసెంబర్ 24 -- అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అని మొదట్లో అన్నారు. కానీ అది కాస్త జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో వెళ్లిపోయినట్లు తర్వాత వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే ప్రాజెక్ట్ బన్నీ దగ్గరికే వచ్చిందని అంటున్నారు. ఈ ఇండస్ట్రీ టాక్ పై ప్రముఖ ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు స్పందించాడు.

అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఏంటి? త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేస్తున్నాడా లేదా? అతని భవిష్యత్తు ప్రాజెక్టులు ఏంటి అన్న ప్రశ్నలకు ప్రొడ్యూసర్ బన్నీ వాసు సమాధానమిచ్చాడు. ఈషా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అతడు మాట్లాడాడు. అయితే ఇలాంటి వాటిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని అతడు చెప్పాడు.

"ఇండస్ట్రీలో ప్రాజెక్టులు అటుఇటూ కావడం జరుగుతుంటాయి. హీరోలు, డైరెక్టర్లు, మాకు అందరికీ మంచి రిలేషన్షిప్స్ ఉన...