భారతదేశం, జూలై 15 -- త్రివిక్రమ్, కొరటాల శివ.. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లు. కానీ వీళ్ల జర్నీ సినిమా రైటర్స్ గానే మొదలైంది. సుకుమార్, పూరీ జగన్నాథ్ లాంటి అగ్రశ్రేణి దర్శకులు ఇప్పటికీ కథలు రాస్తున్నారు. ఇలా మీరు ఎదగాలని ఉందా? ఇలాంటి వాళ్లకు పాపులర్ టీవీ, ఓటీటీ నెట్ వర్క్ గ్రూప్ 'జీ' గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా కథలు రాయాలనే ఆసక్తి, రచనపై పట్టు ఉండి.. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు 'జీ' నెట్ వర్క్ చెప్పిన అద్భుతమైన వార్త ఇది. దేశవ్యాప్తంగా ఉన్న యువతరం, భవిష్యత్ స్క్రీన్ రైటర్లను గుర్తించి, వెలుగులోకి తీసుకొచ్చే లక్ష్యంతో, ఒక మైలురాయి కార్యక్రమంగా 'జీ రైటర్స్ రూమ్'ను ప్రారంభించినట్లు ప్రముఖ కంటెంట్, టెక్నాలజీ పవర్‌హౌస్ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ('Z') సగర్వంగా ప్రకటించింది.

జీ రైటర్స్ రూమ్ అనేది ప్రతిభను ...