Hyderabad, జూలై 15 -- పరాంతకేశ్వరుడు ఆవిర్భవించిన దివ్య ప్రదేశమే కుమారగిరి. ఈ క్షేత్రానికి కుమారగిరి అని పేరు వచ్చినట్టు తెలుస్తుంది. త్రిపురాసుర సంహారం ఈ పుణ్యక్షేత్రంలోనే జరగడం వల్ల దీనికి త్రిపురాంతకమనే పేరు వచ్చింది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పూర్వం తారకాసుని ముగ్గురు కుమారులు లోకకంటకులై ప్రజలను ఓడించసాగారు. ముగ్గురు సోదరులు మూడు పురాలను నిర్మించుకొని, ఆ ఎగురుతూ, ఎక్కడ పడితే అక్కడ దిగి, దేవతలను, మునులను కించపరిచసాగారు. వారు పరమేశ్వరుని శరణు జొచ్చారు. రుద్రబాణంతో అవి ఒకేసారి ధ్వంసమైనాయి. శివుడు అమ్మవారి సాయాన్ని ప్రస్తుతించాడు. ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తానూ అక్కడే ఉండి, ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది అని ప్రముఖ ఆధ్యాత్మి...