Hyderabad, జూన్ 12 -- మలయాళం నుంచి వచ్చిన తొలి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్. అహ్మద్ కబీర్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ రెండో సీజన్ ట్రైలర్ తోపాటు ఇందులోని పాత్రలను కొన్ని రోజులుగా జియోహాట్‌స్టార్ పరిచయం చేస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు.

తాజాగా ఓటీటీప్లేలో వచ్చిన వార్తల ప్రకారం.. కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ రెండో సీజన్ జూన్ 20 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు కొత్త సీజన్లో ఆరు నుంచి 8 ఎపిసోడ్లు ఉంటాయని కూడా వెల్లడించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

ఈ కొత్త సీజన్ కూడా మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తొలి సీజన్ జూన్ 23, 2023లో స్ట్రీమింగ్ అయింది. ఆ లెక్కన సరిగ్గా రెండేళ్ల తర్వాత రెండో సీజన...