Hyderabad, జూన్ 21 -- డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి జాలువారిన మరో ముత్యంలాంటి సినిమా కుబేర అని టాక్ తెచ్చుకుంటోంది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా మెయిన్ లీడ్ రోల్స్ చేసిన కుబేర జూన్ 20న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కుబేరకు ట్రెమండస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్, ఇటు మీడియా నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కుబేర సినిమా దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్-నాగార్జునల నటన గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ధనుష్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడని అంతా పొగుడుతున్నారు. టాప్ యాక్టర్ అంటూ ప్రశంసిస్తున్నారు.

అలాగే, నాగార్జున యాక్టింగ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కుబేరలో నాగార్జున దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఒక రకంగా చెప్పాలంటే కుబేర...