Hyderabad, సెప్టెంబర్ 12 -- మౌళి తనూజ్, శివాని నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై డెబ్యూ దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించారు.

ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించిన లిటిల్ హార్ట్స్ సినిమారు. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా థియేట్రికల్‌గా లిటిల్ హార్ట్స్ సినిమాను రిలీజ్ చేశారు. సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతూ కలెక్షన్స్ అందుకుంటున్న నేపథ్యంలో మూవీ టీమ్ లిటిల్ హార్ట్స్ థ్యాంక్స్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో మౌళి తనూజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ.. "మేము ఊహించినదానికంటే పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ప్రీమియర్స్ నుంచే ఆదరణ చూపించారు. మొదటి రోజే...