భారతదేశం, నవంబర్ 15 -- సినిమాపై వచ్చిన లేటెస్ట్ మూవీ కాంత. దుల్కర్ సల్మాన్, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే కాంత. ఈ మూవీకి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. మంచి బజ్ క్రియేట్ చేసుకున్న కాంత సినిమా థియేటర్లలోకి నవంబర్ 14న అడుగుపెట్టింది.

బాలల దినోత్సవం సందర్భంగా నిన్న థియేటర్లలో విడుదలైన కాంత సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నటీనటుల పర్ఫామెన్స్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంత బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ఇంట్రెస్ట్ నెలకొంది. కాంత సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వచ్చాయి.

ఇక తొలి రోజున ఇండియాలో కాంత మూవీకి రూ. 4 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.25 నుంచి 2.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వ...