భారతదేశం, డిసెంబర్ 11 -- ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సౌది అరేబియాలోని జెడ్డాలో తొలిసారిగా జరిగిన 2025 రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. తొలిసారిగా ఓ గ్లోబల్ ఈవెంట్‌లో పాల్గొన్న కృతి సనన్ అందరి దృష్టిని ఆకర్షించింది. హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి కృతి సనన్ సందడి చేసింది.

ఈ చలన చిత్రోత్సవంలో భాగంగా జరిగిన 'ఉమెన్ ఇన్ సినిమా' గాలా వేడుకలో కృతి సనన్ హాలీవుడ్ ప్రముఖులైన డకోటా జాన్సన్, ఉమా థర్మన్, ఆండ్రియన్ బ్రాడీ వంటి స్టార్స్‌తో కలవడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం కృతి సనన్ ప్రత్యేకంగా దుస్తులను ఎంచుకుంది.

ప్రమఖ డిజైనర్ క్రిస్టినా ఫిడెల్స్కాయ రూపొందించిన న్యూడ్ పింక్ స్లీవ్‌లెస్ గౌనులో కృతి సనన్ అందాలతో మెరిసిపోయింది. ఈ గౌను పైభాగం ఫిట్టెడ్ బోడిస్‌తో, కింద భాగం ఫ్లోరల్ డిజైన్లు ఉన్న నెట్ మెష్ స్కర్ట్‌తో డిజైన్ చేయబడ...