భారతదేశం, నవంబర్ 28 -- మూవీ: తేరే ఇష్క్ మే; దర్శకుడు: ఆనంద్ ఎల్. రాయ్; నటీనటులు: ధనుష్, కృతి సనన్; రిలీజ్ డేట్: నవంబర్ 28, 2025; రేటింగ్:3/5

కబీర్ సింగ్, సైయారా లాంటి సినిమాలు డిఫరెంట్ లవ్ స్టోరీతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు ఆ చిత్రాలను మంచి అదరగొట్టేందుకు మరో డిఫరెంట్ లవ్ స్టోరీ 'తేరే ఇష్క్ మే' వచ్చింది. తమిళ స్టార్ హీరో ధనుష్.. హిందీలో చేసిన మరో సినిమా ఇది. ఇందులో కృతి సనన్ హీరోయిన్. మరి ఇవాళ రిలీజైన సినిమా ఎలా ఉందో ఇక్కడ రివ్యూలో చూద్దాం.

శంకర్ గురుక్కల్ (ధనుష్) ఓ ఎయిర్ ఫోర్స్ పైలట్. క్రమశిక్షణారాహిత్యం కారణంగా సస్పెండ్ అవుతాడు. అప్పుడు అతని మానసికి స్థితిని పరీక్షించేందుకు సైకాలజిస్ట్ ముక్తి భేనివాల్ (కృతి సనన్) వస్తుంది. వీళ్లకు గతం ఉంటుంది. ఏడేళ్ల క్రితం వీళ్లు ప్రేమించుకుంటారు. శంకర్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతుంట...