భారతదేశం, నవంబర్ 24 -- దుబాయ్​ ఎయిర్​ షోలో జరిగిన తేజస్​ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వింగ్​ కమాండర్​ నమన్ష్​ స్యాల్​ అంత్యక్రియలు హిమాచల్​ ప్రదేశ్​ కాంగ్రా జిల్లాలో ఆదివారం జరిగింది. వందలాది మంది ప్రజలు తరలి వెళ్లి నమన్ష్​ స్యాల్​కి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆ సందర్భంలో తీవ్ర భావోద్వేగానికి గురైన నమన్ష్​ స్యాల్​ భార్య, వింగ్​ కమాండర్​ అఫ్షాన్​ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ప్రజలకు కంట తడి పెట్టిస్తోంది.

నవంబర్ 21, శుక్రవారం నాడు దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షో సందర్భంగా తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతుండగా విమానం కూలిపోవడంతో వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్ మరణించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన ఈ పైలట్‌కు భార్య, ఆరేళ్ల కుమార్తె, తల్లిదండ్రులు ఉన్నారు.

"అంకితభావం కలిగిన ఫైటర్ పైలట్...