భారతదేశం, నవంబర్ 23 -- తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ జరిగింది. 22 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేశారు. కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయానికి 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కోహెడ మార్కెట్ యార్డును పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పరిశీలించారు. గతంలో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేదని, ఇవాళ ఛైర్మన్ నిర్మల జయరాజ్, కమిటీ సభ్యులను సత్కరించారు. మార్కెట్ కమిటీకి కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప...