భారతదేశం, జూలై 11 -- మనం రోజూ తినే తెల్ల అన్నం గురించి బోలెడన్ని అనుమానాలున్నాయి కదా. "అన్నం తింటే లావైపోతాం", "షుగర్ వస్తుంది" అని చాలా మంది భయపడుతుంటారు. అయితే, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ లాంటి పెద్ద యూనివర్సిటీల్లో చదువుకుని, జీర్ణవ్యవస్థపై బాగా పట్టున్న డాక్టర్ సౌరభ్ సేథి ఓ కీలక విషయం చెప్పారు. తెల్ల బియ్యం మన ఆరోగ్యానికి ఏమాత్రం 'విలన్' కాదట! మరీ ఎక్కువ తినకుండా, మితంగా తింటే, ఆరోగ్యకరమైన ఆహారంలో ఇది కూడా భాగమే అవుతుందని ఆయన తేల్చి చెప్పారు.

జులై 10న తన ఇన్‌స్టాగ్రామ్‌లో డాక్టర్ సేథి ఒక పోస్ట్ పెట్టారు. "నేను జీర్ణవ్యవస్థ డాక్టర్‌ని. మనం రోజూ తినే ఆహారాల గురించి నేను ఎవ్వరికీ చెప్పకుండా దాచుకోవడానికి ఇష్టపడని 9 విషయాలు ఇక్కడ ఉన్నాయి" అని రాశారు. "ఈ పోస్ట్ సేవ్ చేసుకోండి.. మళ్ళీ మళ్ళీ చూసుకుంటారు" అని కూడా ఆయన రాశారు.

నిజానికి తెల్ల బ...