Hyderabad, ఫిబ్రవరి 28 -- పటిక చాలా తక్కువ రేటుకే మార్కెట్లో దొరుకుతుంది. ఇది సౌందర్య సాధనంగా కూడా వినియోగించుకోవచ్చు. ఎంతోమంది బయట దొరికే కాస్మోటిక్స్ నే వాడడానికి ఇష్టపడతారు. వాటిలో అనేక రసాయనాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పట్టిక వంటి సహజ పదార్థాలతోనే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి.

ఈ తెల్లటి పదార్థం అనేక చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి రాత్రి పూట పట్టికతో ఒక చిట్కాను చేయండి చాలు. ఉదయానికి మీ చర్మం మృదువుగా మారుతుంది.

రాత్రిపూట పటికను పొడిలా చేసి కాస్త నీరు కలిపి పేస్టులాగా చేసుకోవాలి. దీన్ని రాత్రి సమయంలో ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచిదే లేక అలా నిద్రపోతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ ముఖానికి పటికను రాసి రాత్రంతా నిద్రపో...