భారతదేశం, జనవరి 21 -- మాళవికా మోహనన్.. ఈ మధ్యే ది రాజా సాబ్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ. ఒకప్పుడు ఓ తమిళ సినిమాలో ఆమె ఎమోషన్స్ సరిగా చూపించలేక ట్రోలింగ్ కు గురైంది. అలాంటి నటి ఇప్పుడు తెలుగు, తమిళ హీరోయిన్లకు అసలు డైలాగులు చెప్పడం రాదంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ది రాజా సాబ్ హీరోయిన్ మాళవికా మోహనన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పాయీ, ఇషాన్ ఖట్టర్ కూడా ఉన్నారు. వాళ్లతో మాట్లాడుతూ తెలుగు, తమిళ హీరోయిన్లకు డైలాగులు చెప్పడం రాదని మాళవిక చెప్పింది.

"తెలుగు, తమిళంలలో చాలా కాలంగా కొంతమంది హీరోయిన్లు అసలు డైలాగులను చూడనే చూడరు. ఓ సీన్ లో బాధగా కనిపించాలంటే ముఖం బాధగా పెట్టి 1, 2, 3, 4.. 1, 2, 3,4 అనేవాళ్లు. అంతే.. ఎందుకంటే ఏదో సమయంలో డ...