Hyderabad, జూలై 30 -- తెలుగు, తమిళ నటుడు నవీన్ చంద్ర లీడ్ రోల్లో నటించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి (Inspector Rishi). గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఇప్పుడు రెండో సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్ ను నవీన్ చంద్ర ఇచ్చాడు.

యాక్టర్ నవీన్ చంద్ర వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది కాలంగా అతడు నటించిన ఎన్నో సినిమాలు, సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఇప్పుడు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి రెండో సీజన్ పనులు కూడా మొదలైనట్లు అతడు వెల్లడించాడు. రెండో సీజన్ తొలి ఎపిసోడ్ కు సంబంధించిన స్క్రిప్ట్ ఫొటోను నవీన్ చంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ కొత్త సీజన్ ప్రస్తుతం ప్రీప్రొడక...