భారతదేశం, నవంబర్ 18 -- నటి మీరా వాసుదేవన్ తన మూడవ భర్త, సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియాంకమ్ నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వచ్చింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది ఆగష్టు నుండి ఒంటరిగా ఉంది. నటి దీనికి ఎటువంటి కారణాలు వెల్లడించనప్పటికీ, విడాకుల తర్వాత జీవితం అత్యంత ప్రశాంతంగా ఉందని మాత్రం మీరా భావిస్తున్నారు.

తెలుగు సినిమాతో డెబ్యూ చేసి మలయాళంలో పాపులర్ అయిన నటి మీరా వాసుదేవన్ మూడోసారి విడాకులు తీసుకుంది. "నేను, నటి మీరా వాసుదేవన్. ఆగష్టు 2025 నుండి ఒంటరిగా ఉన్నానని అధికారికంగా ప్రకటిస్తున్నా. నా జీవితంలో అత్యంత అద్భుతమైన, ప్రశాంతమైన దశలో ఉన్నాను" అని ఆమె హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తూ రాశారు. ఆమె 'ఫోకస్డ్', 'బ్లెస్డ్', 'గ్రాటిట్యూడ్' వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించారు.

మీరా వాసుదే...