భారతదేశం, జనవరి 10 -- శివకార్తికేయన్, శ్రీలీల జంటగా.. లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన పీరియాడికల్ డ్రామా 'పరాశక్తి'. పొంగల్ రేసులో భాగంగా శనివారం (జనవరి 10) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. విడుదలైన తొలి రోజే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సినిమా కంటెంట్ కంటే, బయటకు లీక్ అయిన సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లిస్ట్‌లో తెలుగువారిని ఉద్దేశించి వాడిన ఒక పదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

లీక్ అయిన సెన్సార్ కట్స్ జాబితా ప్రకారం.. సినిమాలో 'గొల్టీ' (Golty) అనే పదాన్ని సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది. సాధారణంగా తమిళనాట కొంతమంది తెలుగువారిని కించపరచడానికి లేదా ఎగతాళి చేయడానికి ఈ పదాన్ని వాడుతుంటారు. 'తెలుగు' ఇంగ్లిష్ పదాన్ని తిరగేస్తే (gulute) ఈ పదం వచ్చిందని కొందరు, ఇది వెనుకబాటుతనాన్ని సూచించే బూతు పద...