భారతదేశం, జనవరి 11 -- చివరి నిమిషంలో సెన్సార్ క్లియరెన్స్, రకరకాల వివాదాల నడుమ ఎట్టకేలకు శనివారం (జనవరి 10) విడుదలైన శివకార్తికేయన్ మూవీ 'పరాశక్తి'. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద తొలి రోజు వసూళ్లు మాత్రం ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయాయి. తెలుగు వాళ్లను అవమానించారన్న విమర్శల నేపథ్యంలో ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి.

ప్రముఖ ట్రాకర్ 'సాక్నిల్క్' (Sacnilk) నివేదిక ప్రకారం.. 'పరాశక్తి' విడుదలైన మొదటి రోజు ఇండియాలో సుమారు రూ. 11.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తమిళనాట 62.79% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ నంబర్స్ బాగానే ఉన్నా, శివకార్తికేయన్ గత చిత్రాలతో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. పరాశక్తి సినిమాకు తొలి రోజే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. ముఖ్యంగా సెకండాఫ్ దారుణంగా ఉందని, మరీ సాగదీశా...