భారతదేశం, ఏప్రిల్ 27 -- ఏపీలో రేపు భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు(సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అలాగే ఉష్ణోగ్రతలు 40-42degC మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఆదివారం అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో 41.4degC అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

ఎల్లుండి ఉత్తరాంధ్ర, కాకినాడ, ఏలూరులో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, చెట్ల కింద నిలబడవద్దని సూచించింది.

తెలంగాణలో నేటి రాత్రి నుంచి రేపు ఉదయం వరకు తేలికపాటి నుండి ఒక మోస్తా...