భారతదేశం, ఏప్రిల్ 30 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఏపీలోని ఉత్తరకోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు కోస్తాంధ్రలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అక్కడక్కడా చెదురుమదురుగా భారీవర్షాలు నమోదు కావొచ్చని తెలిపారు. అలాగే మరోవైపు కొన్నిచోట్ల ఎండ తీవ్రత ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి ఉష్ణోగ్రతలు 40-42degC మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదన్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అన...