భారతదేశం, జనవరి 14 -- ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మొదటి రోజైన భోగి వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెల్లవారుజామునే నిద్రలేచి. భోగి మంటలు వేశారు. రంగురంగుల ముగ్గులతో కాలనీలన్నీ అపురూరంగా దర్శనమిస్తున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవారి ఆలయ సముదాయం మరియు చుట్టుపక్కల సాంప్రదాయ భోగి భోగి మంటలను నిర్వహించడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వైభవంతో మెరిసింది. మరోవైపు పండగ వేళ కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

గుంటూరులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే భోగి మంటలు వెలిగించి కార్యకర్తలతో జోష్ గా అంబటి రాంబాబు.. మాస్ స్టెప్పలు వేశారు. ప్రత్యేక పాటపై తన స్టెప్పుల...