భారతదేశం, జనవరి 4 -- తెలుగు రాష్ట్రాల్లో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు మృతి చెందారు. యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్‌ను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన బొల్లా దీక్షిత్ (21), కొక్కల సాయి (20)గా గుర్తించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో మోత్కూరు నుండి వలిగొండ వైపు యువకులు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం...