భారతదేశం, మే 3 -- తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఇతర జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు బుధవారం వరకు కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం వరకు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద నిలబడవదని సూచించింది.

మరోవైపు రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు 41.5degC - 43degC మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని ప్రకటించింది.

రేపు(ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగ...